భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వి. రాములుఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం.
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 18 :
మంచిర్యాల జిల్లా భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న ఎస్ఐఆర్ (సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ సవరణ ప్రక్రియ పురోగతిని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ఎస్ఐఆర్ ఓటర్ సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు, తమ ఓటును కాపాడుకునేందుకు వెంటనే గుర్తింపు/నిర్ధారణ పత్రాల జిరాక్స్ ప్రతులను సంబంధిత బిఎల్ఓ లకు ఈ నెల 30 లోపు అందజేయాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బిఎల్ఓలతో పాటు బిఎల్ఏ లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, విలేకరులు ముందుకు వచ్చి ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భీమారం తహశీల్దార్ సదానందం, డిప్యూటీ తహశీల్దార్ అంజమ్మ, జిపిఓ లు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు